ఎల్ నినో ప్రభావంపై రైతులకు అవగాహన -గుగ్గిళ్లలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై మండల వ్యవసాయ అధికారి సంతోష్ సూచనలు
బెజ్జంకి, జూలై 25 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో ఎల్ నినో ప్రభావంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి సంతోష్ మాట్లాడుతూ, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పంటలను ఎంపిక చేసుకోవాలని, వ్యవసాయ శాఖ సూచనలను పాటిస్తూ శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపడితే నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపారు. రైతులు తమ సమీప వ్యవసాయ విస్తరణ...