ఎల్లంపల్లి మోడల్ స్కూల్లో సంచలన చర్యలు ప్రిన్సిపల్ సస్పెన్షన్ – అసభ్యంగా ప్రవర్తించిన పీడీ తొలగింపు

బెజ్జంకి, జూలై 22 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఎల్లంపల్లి మోడల్ స్కూల్ లో  విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యాయామ ఉపాధ్యాయుడు (పీడీ) కనకారెడ్డిని సర్వీసు నుంచి తొలగించారు. విధుల్లో అలసత్వం వహించినందుకు పాఠశాల ప్రిన్సిపల్ మాలోత్ సంగీతను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ హైమావతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల విద్యార్థినులు పీడీ ప్రవర్తనపై ఫిర్యాదు చేయడంతో పాటు పాఠశాల ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టగా ఆరోపణలు ప్రాథమికంగా నిజమని తేలినట్లు...