prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 9:22 am Digital Edition : RAJASHEKARREDDY

ఎల్లంపల్లి మోడల్ స్కూల్లో విద్యార్థులకు సమ్మర్ క్యాంప్

 

బెజ్జంకి, మే 7 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని ఎల్లంపల్లి గ్రామ మోడల్ స్కూల్లో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం సమ్మర్ క్యాంప్–2026 నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ మాలోత్ సంగీత తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మే 11 నుంచి 25వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుండి క్యాంప్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఈ సమ్మర్ క్యాంప్‌లో కంప్యూటర్ శిక్షణ, డ్యాన్స్, సంగీతం, క్రీడలు, మ్యూజిక్, యోగ,తదితర అంశాలలో ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయనున్నట్లు తెలుపుతూ,
విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసి, ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు సృజనాత్మకత అభివృద్ధి చెందేలా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రిన్సిపల్ మాలోత్ సంగీత తెలిపారు.