ఎల్లంపల్లి నుంచి 4 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల: గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

  ప్రాజెక్టు, గోదావరి ఘాట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఏసీపీ ఎం. రమేష్ గోదావరిఖని, జూలై 30 ప్రజావాణి : ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో గోదావరి పరివాహక, దిగువ ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం  రామగుండం సీఐ కృష్ణ కుమార్, గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డితో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీటి ప్రవాహ...