ఎల్లంపల్లిలో విద్యుత్ సమస్యలతో ప్రజల్లో భయం అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం
బెజ్జంకి,ఏప్రిల్ 15 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన ఎల్లంపల్లి గ్రామంలో తీవ్ర విద్యుత్ సమస్యలు నెలకొని ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి.సింగిల్ ఫేజ్ లైన్‌కు త్రీఫేజ్ లైన్ కలిసిపోవడంతో అధిక వోల్టేజ్ సరఫరా జరుగుతూ, ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మంటలు చెలరేగుతున్నాయి. దీంతో ఇళ్లలోని విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోవడం, పేలిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల సమీపంలో ఉన్న సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మంటలు, గట్టిగా శబ్దాలు రావడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే సబ్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే...