“ఎల్‌నీనో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి”- ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్ల ఏర్పాటుతో నీటి సంరక్షణ సాధ్యం
బెజ్జంకి,జూలై 20 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని రేగులపల్లి గ్రామంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఎల్‌నీనో ప్రభావం నేపథ్యంలో గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఎల్‌నీనో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నందున రైతులు వరి సాగును తగ్గించి ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి రైతులు తమ పొలాల్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవడంతో పాటు ఫామ్ పాండ్లు (ఫార్మ్ పాండ్స్ )...