ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి: కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

ఘట్‌కేసర్, జూలై 7: మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఘట్‌కేసర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఎల్‌ఆర్‌ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దరఖాస్తులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎల్‌ఆర్‌ఎస్‌కు సంబంధించిన దరఖాస్తుల పరిశీలనలో భాగంగా ఎల్-1, ఎల్-2, ఎల్-3 స్థాయిల ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన దరఖాస్తుదారులకు ఎల్‌ఆర్‌ఎస్ ప్రొసీడింగ్స్ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజుపై ప్రభుత్వం కల్పించిన 25 శాతం రాయితీ ఈ నెల 31వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో, కార్యాలయ...