ఎర్రవరం గ్రామ పాలనాధికారి రక్తదానం
కోదాడ, జూన్ 12,(ప్రజావాణి న్యూస్ ):
కోదాడ
మండల పరిధిలోని ఎర్రవరం గ్రామానికి చెందిన గ్రామ పాలన అధికారి కాకునూరి ఆనందరెడ్డి శుక్రవారం రక్తదానం చేసి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆపన్న హస్తం అందించారు. కోదాడ పట్టణంలో తిరుమల హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మహిళకు ఏ ప్లస్ బ్లడ్ గ్రూప్ రక్తం అవసరం ఉండడంతో ఈ విషయాన్ని జర్నలిస్టు నాగరాజు ద్వారా తెలుసుకొని మేళ్లచెరువు గ్రామానికి చెందిన ఎర్రవరం గ్రామ పాలనా అధికారి కాకునూరి ఆనంద్ రెడ్డి వెంటనే స్పందించి ఏ ప్లస్ బ్లడ్ గ్రూప్ రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. తిరుమల హాస్పిటల్ కి వెళ్లి మహిళకు రక్తదానం చేశారు. కాకునూరి ఆనంద రెడ్డి సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుంటూ బాధ్యతతో సేవలు అందిస్తున్నారు.