prajavaani.net
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 9:03 am Digital Edition : PRAJA VANI

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం<br>

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం

* మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళి

* గ్రామాల్లో రైతులకు ఇబ్బందులు ఉంటే ముఖ్యంగా యూరియా ఇబ్బంది ఉంటే నాదృష్టికి తీస్కొని రండి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

జమ్మికుంట ఆగస్టు 5 (ప్రజావాణి)

హుజూరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాన్ని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్.రెడ్డినిర్వహించారుఈసమావేశంలోనియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు సమన్వయ కమిటీ సభ్యులు పార్టీ నాయకులుపాల్గొన్నారుసమావేశానికి ముందు ఇటీవల మృతి చెందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులుపెద్ది సుదర్శన్ రెడ్డి కి మౌనం పాటించి నివాళి అర్పించారుఅనంతరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న పంటల పరిస్థితి సాగునీటి కొరత రైతులకు ఎదురవుతున్న యూరియా సమస్యలపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి  ఆయా గ్రామాల నాయకులను అడిగి తెలుసుకున్నారురైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందా పంటలకు సాగునీరు అందుతున్నదాఏయే ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందనే అంశాలపై నాయకులతో వివరంగా చర్చించారుప్రతి గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని గ్రామస్థాయిలో నాయకులు కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే నాయకులకు సూచించారు. ప్రతి గ్రామంలో పార్టీ సభ్యత్వ నమోదు బూత్ స్థాయి కార్యకలాపాలను పటిష్టం చేసి పార్టీకి మరింత బలమైన పునాది ఏర్పాటు చేయాలని అన్నారు సార్ఓటర్ ప్రక్రియలో పాల్గొన్న బూత్ ఏజెంట్లకు ధన్యవాదాలు తెలిపారు ప్రతి గ్రామం, ప్రతి బూత్ స్థాయిలో పకడ్బందీగా పూర్తి చేయడంతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారుస్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్‌ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలి. ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా ఇప్పటి నుంచే గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారుప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని ఎమ్మెల్యే అన్నారు కేసీఆర్ పాలనలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలుగుర్తుచేసుకుంటున్నారనిమళ్లీ కేసీఆర్ ని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారనితెలిపారురైతులు పేదలు సామాన్య ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వారి పక్షాన నిలబడాలని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి  పార్టీ శ్రేణులకు సూచించారుఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు