prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 March 2026, 11:42 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే పుట్టా ”సుధాకర్ యాదవ్..

ప్రజావాణిన్యూస్(మార్చి24)మైదుకూరు ప్రజలనుండి వినతులు స్వీకరించి తక్షణ పరిష్కారానికి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే.ప్రజలు ప్రతి సమస్యను ఫిర్యాదు రూపంలో ఎమ్మెల్యే కార్యాలయంలో సమర్పించాలి.క్యాంపు కార్యాలయంలోని సిబ్బంది కి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి ఎన్ని పరిష్కారం అయ్యాయి వాటి స్థితిగతులను విజన్ ఆఫీసర్ వినోద్ ను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ‘మైదుకూరు మున్సిపాలిటీ 12వ వార్డులో దారి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేని కోరిన మహిళలు.తక్షణమే దారి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే.ప్రజలు ఇచ్చే ఫిర్యాదులు ఎమ్మెల్యే కార్యాలయం ద్వారా సీఎం కార్యాలయానికి వెళ్లి అక్కడ నుండి కలెక్టర్ కార్యాలయానికి వస్తాయి.సమస్యల పరిష్కారం కాకపోతే కలెక్టర్ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటారు.పరిష్కారం తరువాత సీఎం ఓ కార్యాలయం నుండి ఫోన్ కాల్ ద్వారా అభిప్రాయం తీసుకుంటారు.సమస్య పరిష్కారం కాలేదని చెబితే ఆ సమస్యపై కలెక్టర్ చర్యలు తీసుకుంటారు.వచ్చిన ప్రతి ఫిర్యాదు సంబంధిత అధికారులకు పంపించడం జరుగుతుంది.ప్రతి ఫిర్యాదు దాని ప్రియారిటిని బట్టి నిర్నిత సమయంలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు.ప్రజా సమస్యల పరిష్కార వేదిక చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు..ప్రజలు సమస్యలు ఉన్నాయని చెప్పడం కన్నా ఫిర్యాదు రూపంలో కార్యాలయంలో అందజేయాలి.ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి.ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్.