ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరల భారీ పెంపు ప్రజలపై భారం తక్షణమే ధరల పెంపును ఉపసంహరించాలి – కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి

ప్రజావాణి కడప డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3కు పెంచడం ప్రజలపై మరింత ఆర్థిక భారం మోపినట్లేనని ఆమె విమర్శించారు.ఈ ధరల పెంపుతో రాష్ట్రంలో పెట్రోల్ ధర లీటరుకు రూ.109.75 నుండి రూ.113.03కు, డీజిల్ ధర రూ.97.57 నుండి రూ.100.71కు పెరిగిందని ఆమె తెలిపారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు...