ఎదులాబాద్ డివిజన్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్
ఘట్‌కేసర్, జూలై 27: మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఘట్‌కేసర్ సర్కిల్ ఎదులాబాద్ 7వ డివిజన్‌లోని ఘనపురం, లింగాపురం గ్రామాల్లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, ఎదులాబాద్ 7వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు సామల అమరేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించి, ఓటరు వివరాలను సకాలంలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వేముల మహేష్ గౌడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ స్థాయి...