ఎదులాబాద్ డివిజన్‌లో ఎస్‌ఐఆర్‌పై అవగాహన ప్రచార రథం ప్రారంభం….అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు పరిశీలించుకోవాలి: కాంగ్రెస్ నాయకులు

ఘట్‌కేసర్, జూలై 31: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు ఎదులాబాద్ 7వ డివిజన్‌లో కాంగ్రెస్ నాయకుడు గాయరు విశ్వనాథం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, ఎదులాబాద్ 7వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామల అమరేందర్ చేతుల మీదుగా ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని...