prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 7:25 pm Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఎదులాబాద్ డివిజన్‌లో ఎస్‌ఐఆర్‌పై అవగాహన ప్రచార రథం ప్రారంభం….అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేరు పరిశీలించుకోవాలి: కాంగ్రెస్ నాయకులు

ఘట్‌కేసర్, జూలై 31: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేందుకు ఎదులాబాద్ 7వ డివిజన్‌లో కాంగ్రెస్ నాయకుడు గాయరు విశ్వనాథం ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, ఎదులాబాద్ 7వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సామల అమరేందర్ చేతుల మీదుగా ప్రచార రథాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేరు ఓటరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. కొత్త ఓటరు నమోదుకు అర్హులైన వారు నమోదు చేసుకోవడంతో పాటు, పేరు, చిరునామా, ఇతర వివరాల్లో మార్పులు అవసరమైతే నిర్ణీత గడువులోగా సవరణలు పూర్తి చేసుకోవాలని కోరారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఓటరికి సేవలు చేరేలా చేయడమే ఈ ప్రచార వాహనం ఏర్పాటు లక్ష్యమని తెలిపారు.

ఎదులాబాద్ డివిజన్ పరిధిలోని గ్రామాలు, కాలనీల్లో ఈ ప్రచార వాహనం తిరుగుతూ ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయనుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటరు వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేసుకోవాలని కాంగ్రెస్ నాయకుడు గాయరు విశ్వనాథం విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాయిల్లు, అశోక్ గౌడ్, చందు, ఉదయ్ రెడ్డి, బద్దం వెంకటేష్, మెట్టు రమేష్, మెట్టు నర్సింహ, సత్తయ్య, పుర్రు బసయ్య, నిఖిల్, నరేష్, మంకం శ్రీను, కామరాజు కృష్ణ, శ్రీనివాస్ యాదవ్, గిరిబాబు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.