ఎదులాబాద్‌లో మే 2న హిందూ సమ్మేళనం — ఘనంగా కరపత్రం ఆవిష్కరణ
ఘట్‌కేసర్, ఏప్రిల్ 28 (ప్రజావాణి): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ గ్రామంలోని ఊర హనుమాన్ దేవాలయంలో హిందూ సమ్మేళన ఆహ్వాన కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. హనుమాన్ మాల ధారణ చేసిన స్వాములు, స్థానిక హిందూ సంఘాల నాయకులు, భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ “హిందూ పులులంతా కదులుదాం… హిందూ శక్తిని చాటుదాం” అనే నినాదంతో సమ్మేళనాన్ని భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 2వ తేదీ...