prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 6:54 am Digital Edition : RAJASHEKARREDDY

ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి

బెజ్జంకి మండల కార్యదర్శి బోనగిరి రూపేష్

బెజ్జంకి,ఏప్రిల్17(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో సీపీఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించే విధంగా, పాకిస్థాన్‌తో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.రూపేష్ మాట్లాడుతూ, తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను కించపరిచేలా మాట్లాడడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయని అన్నారు.అలాగే, తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. బీజేపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు.