ఎండైనా వానైనా రహదారి భద్రతే ముఖ్యం
పసర ఎస్ఐ తాజుద్దీన్
ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)
గోవిందరావుపేట మండల కేంద్రంలో రక్షక భటులు అంటేనే రాత్రింబవళ్లు ప్రజల కోసం నిలిచే వారు.
శాంతి భద్రతలకు ఎలాంటి అంతరాయం రాకుండా డేగ కన్నుల్లా పహారా కాస్తూ విధులు నిర్వర్తిస్తుంటారు.
మంగళవారం నాడు పసర పోలీస్ స్టేషన్ సమీపంలోని 163వ జాతీయ రహదారిపై వర్షం కురుస్తున్నప్పటికీ ఎస్ఐ తాజుద్దీన్ ఆదేశాల మేరకు వాహన తనిఖీలు చేపట్టారు.
రహదారిపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
వాహనాలకు సరైన ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయా లేవా అని పరిశీలించడంతో పాటు, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన వివరాలపై ఆరా తీశారు.
ఈ కార్యక్రమంలో పసర సెకండ్ ఎస్ఐ రాజేందర్, ఎర్రయ్య, కానిస్టేబుల్స్ కూడా పాల్గొని సహకరించారు.
“ప్రజల ప్రాణాల రక్షణ, రహదారి భద్రతే మా ప్రధాన లక్ష్యం” అని ఎస్ఐ తాజుద్దీన్ పేర్కొన్నారు.
వాతావరణం ఎలా ఉన్నా కర్తవ్యాన్ని విస్మరించకుండా పనిచేస్తున్న పోలీస్ సిబ్బందిని స్థానికులు అభినందించారు.
*బై రిపోర్టర్: గొల్లపెల్లి లక్ష్మి కాంత్*