prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 6:49 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

ఎండపల్లి మండలంలో ‘సర్పంచ్ పతుల’ హవా: మహిళా సాధికారతకు తూట్లు

ఎండపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన జీపీడీపీ అధికారిక సమావేశంలో మహిళా సర్పంచుల స్థానంలో వారి భర్తలు పాల్గొనడం తీవ్ర చర్చనీయాంశమైంది. మండలంలోని ఏడుగురు మహిళా సర్పంచులు గైర్హాజరు కాగా, ఐదుగురు సర్పంచ్ పతులు అధికారుల సమక్షంలోనే కుర్చీల్లో కూర్చుని సమీక్షించారు. రాజ్యాంగం మహిళలకు కల్పించిన రాజకీయ సాధికారతను ఈ ‘సర్పంచ్ పతి’ వ్యవస్థ అపహాస్యం చేస్తోందని సామాజిక సంఘాలు మండిపడుతున్నాయి. మహిళా సర్పంచులే అధికారిక సమావేశాల్లో పాల్గొనేలా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.