prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 3:56 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

ఎండపల్లిలో క్రికెట్ పోటీలు ప్రారంభం

ఎండపల్లి మండల కేంద్రంలో గురువారం ఎండపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను సర్పంచ్ మారం సునీత జలంధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… యువత గంజాయి, మద్యానికి దూరంగా ఉండి, క్రీడల్లో రాణించి భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. విజేతలకు ట్రోఫీతో పాటు నగదు బహుమతి అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కొమురయ్య, ఉపసర్పంచ్ కళ్యాణి, వార్డు సభ్యులు మధు, రాజేశం, సంపత్, స్వామి, అంజి, క్రీడాకారులు పాల్గొన్నారు.