ఉమ్మడి నల్లగొండ జిల్లా సాహిత్య చరిత్ర నిర్మాణానికి కసరత్తు
*ఉమ్మడి నల్లగొండ జిల్లా సాహిత్య చరిత్ర నిర్మాణానికి కసరత్తు* *నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* ఉమ్మడి నల్లగొండ జిల్లా సాహిత్య చరిత్రను సమగ్రంగా పుస్తక రూపంలో తీసుకురావడానికి ప్రత్యేక సమాచార సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు చండూరు పట్టణానికి చెందిన తెలుగు సాహిత్య పరిశోధకులు, అధ్యాపకులు డా. ఇడికోజు శ్రీనివాసాచారి తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన రచయితలు, కవులు, పరిశోధకులు, సాహిత్యాభిమానుల వివరాలను సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాంతీయ సాహిత్య చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ...