prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 6:19 am Digital Edition : PRAJA VANI

ఉప సర్పంచ్ ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి

ఉప సర్పంచ్ ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలి,.

ఉపసర్పంచ్ లసంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మహంకాళి రామారావు డిమాండ్,.
బూర్గంపాడు మండలం/ ప్రజావాణి/ ప్రతినిధి జూన్2,.

ఉప సర్పంచ్ ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంతక్షణం చొరవ చూపాలని ఉప సర్పంచ్ల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మహంకాళి రామారావు అన్నారు. మంగళవారం బూర్గంపాడు మండలంలోని తాళ్లగమ్మురు రైతు వేదికలో ఉపసర్పంచ్ ల సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మహంకాళి రామారావు ఉప సర్పంచ్లు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చర్చించారు. ఉపసర్పంచ్ లకు యధావిధిగ చెక్ పవర్ ఇవ్వాలని అన్నారు. గ్రామపంచాయతీ అభివృద్ధిలో ఉప సర్పంచ్  లయొక్క పాత్ర చాలా కీలకమైంది అని అన్నారు. ప్రభుత్వం తక్షణమే ఉప సర్పంచ్లకు 5000 రూపాయలు వేతనం కల్పించాలన్నారు. వార్డు సభ్యులకు 3000 రూపాయలు భృతిని  కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ అభివృద్ధి లొ ఉప సర్పంచ్లు మరియు వార్డు సభ్యుల యొక్క పాత్రచాలా కీలకమైందని అన్నారు. అందుచేత ఉపసర్పంచ్ లకుతగిన ఆర్థిక మరియు భద్రత భరోసా కల్పించాలని అన్నారు. తమ యొక్క న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించలని లేని యెడల తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని మండలంలోని ఉపసర్పంచులు  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలకు సంబంధించిన  ఉప సర్పంచ్లు, పోదెం.సుధాకర్ , తోటమల్ల వెంకటరమణ,రాధాకృష్ణ ,సున్నం నాగమణి, బేబీ,మోహన్ రావు, పోకుల రవి, భూక్య జయ, అప్పి రెడ్డి, సిహెచ్ కుమారి, ఇస్లావత్ రవి తదితరులు పాల్గొన్నారు