ఉపాధి హామీ పనుల్లో ఘోర నిర్లక్ష్యం

ప్రజావాణి, తిరుమలాయపాలెం : తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామంలో శనివారం నిర్వహించిన ఉపాధి హామీ పనుల్లో అధికారుల నిర్లక్ష్యం బహిర్గతమైంది. గ్రామ పరిధిలో చేపడుతున్న కాలువల మరమ్మత్తు పనుల సమయంలో కూలీలు విచక్షణారహితంగా ఈత చెట్లకు నిప్పు పెట్టి కాల్చివేస్తుండటం స్థానిక గీత కార్మికుల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.గ్రామంలో ఉపాధి హామీ పనుల పేరుతో జరుగుతున్న ఈ చర్యల వల్ల గీత కార్మికుల జీవనోపాధి పూర్తిగా దెబ్బతింటోందని వారు వాపోతున్నారు. ఈత చెట్లు గీత కార్మికులకు ప్రధాన ఆదాయ వనరుగా ఉండగా, వాటిని కూలీలు...