ఉపాధి హామీ పనులు ప్రారంభించిన గ్రామ సర్పంచ్ భాస్కర్
కూలీలకు సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచనలు
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చి 16 (ప్రజావాణి):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం శానబండ గ్రామంలో ఉపాధి హామీ (వంద రోజుల పని) పథకం పనులను సోమవారం రోజున గ్రామంలోని కొండేన్గాలా బోర్ ప్రాంతంలో స్థానిక సర్పంచ్ గాధం భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ… గ్రామంలోని కూలీలందరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ పనులను చేపట్టినట్లు తెలిపారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కూలీలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను కోరారు. అర్హులైన ప్రతి కూలీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌తో పాటు, ఉప సర్పంచ్ కడారి రజిత, వార్డ్ సభ్యులు శంకరయ్య, సీనియర్ మెట్ తేజ, గ్రామ కార్యదర్శి మారుతీ, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.