prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 1:35 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు..వ్యవసాయ కార్మిక సంఘం

గోపవరం ప్రజావాణి న్యూస్ మండలం బుచ్చనపల్లెగ్రామంలో శనివారం జరుగుతున్న గ్రామీణ పేదల జీవనాధారంగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చ ట్టాన్ని కేంద్ర ప్రభుత్వం దశలవారీగా నిర్వీర్యం చేయడానికి కుట్రపూరిత చర్యలు చేపడుతోందని జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ ఆరోపణ. ఉపాధి హామీ పనులను పరిశీలించిన.కూలీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు.వి వీరశేఖర్ మాట్లాడుతూ.దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీల ఉద్యమాల ఫలితంగానే గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలులోకి వచ్చిందన్నారు.పేదలకు పనైనా పెట్టండి,తిండైనా పెట్టండి”అనే నినాదంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరిగిన భారీ ప్రజా ఉద్యమాల ఒత్తిడితోనే 2005లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై వామపక్ష పార్టీల ఎంపీలు తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారని, దాని ఫలితంగానే ఉపాధి హామీ చట్టం దేశంలో అమలులోకి వచ్చిందని గుర్తు చేశారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 20 కోట్ల మంది కూలీలు ఈ పథకంపై ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని బలహీనపరచడానికి పలు మార్గాల్లో ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఉపాధి హామీ చట్టాన్ని చట్టబద్ధ హక్కు నుంచి కేవలం ఒక ప్రభుత్వ పథకంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని,చట్టానికి ఉన్న రాజ్యాంగ పరిరక్షణను తగ్గించే విధానాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు.మహాత్మా గాంధీ పేరు తొలగించి“వి బిజి రాంజీ” పేరిట మార్పులు తీసుకురావడం కూడా ఆ కుట్రలో భాగమేనన్నారు. అలాగే కేంద్రం 60 శాతం,రాష్ట్రాలు 40 శాతం నిధులు భరించాలనే నిబంధనలు విధించడం వెనుక కూడా రాజకీయ ఉద్దేశాలే ఉన్నాయని విమర్శించారు. ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు ఇది భారమవుతుందని, ఫలితంగా పనులు తగ్గిపోతాయని చెప్పారు.గతంలో ఉపాధి హామీ పనుల్లో వ్యవసాయ కూలీలకు అనేక సౌకర్యాలు ఉండేవని, పనులకు అవసరమైన పనిముట్లు కూడా అందించేవారని వీర శేఖర్ గుర్తు చేశారు. పని పూర్తయిన వెంటనే కూలీల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేవని, దీంతో పేద కుటుంబాలు రోజువారీ జీవనాన్ని నెట్టుకొచ్చేవని అన్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, నెలలు గడిచినా కూలీలకు వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం కారణంగా గ్రామీణ పేదలు అప్పుల పాలవుతున్నారని, కుటుంబ పోషణ కూడా కష్టంగా మారుతోందన్నారు.పని చేయించిన వెంటనే కూలి ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. కానీ ఇప్పుడు కూలీలను తిరుగులాడిస్తూ అవమానించే పరిస్థితి తీసుకొచ్చారు” అని విమర్శించారు. గ్రామ సభల అధికారాలను కూడా క్రమంగా తగ్గిస్తూ అధికార యంత్రాంగం చేతుల్లోనే పనుల నిర్ణయాలు కేంద్రీకృతం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.“ఒకప్పుడు గ్రామంలో ఏ పని చేయాలన్నా గ్రామ సభ తీర్మానం తప్పనిసరి. ఇప్పుడు అధికారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ పనులు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది గ్రామీణ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్య” అని అన్నారు.కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలకే పని చేస్తోందని, అదే సమయంలో పేదల సంక్షేమ పథకాలను కుదించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు చెందిన లక్షల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేస్తూ, గ్రామీణ పేదల ఉపాధిని మాత్రం కోత పెట్టడం దారుణమన్నారు. ఉపాధి హామీ పథకాన్ని బలహీనపరిచి గ్రామీణ కూలీలను కార్పొరేట్ కంపెనీలకు చౌక కార్మికులుగా తరలించే విధంగా కేంద్ర విధానాలు ఉన్నాయని ఆరోపించారు.అందుకోసం కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్వతిరేకంగా గ్రామీణ ప్రాంత వ్వవసాయ కూలీలు అందురు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం చేస్తున్న పోరాటంలో ఉపాధి కూలీలందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గూడూరు పెంచలయ్య వ్యవసాయ కార్మిక సంఘం ఏరియా అధ్యక్షులు పొంగూరు నాగరాజు, మండల నాయకులు బాల ఓబులేష్ సుబ్బరాయుడు పాల్గొన్నారు