జూన్ 02 ప్రజావాణి కలసపాడు బస్టాండ్ నుంచి ఉపాధి కూలీలు ర్యాలీగా మాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేదలకు పెద్ద ఆసరాగా 20 సంవత్సరాలు పాటు ఉన్నది కొత్తగా విబిజి గ్రామ జి స్కీమ్ వల్ల పేదలు తీవ్రంగా పనులు లేక నష్టపోతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వి అన్వేష్ మండల అధ్యక్ష కార్యదర్శులు కారు యర్జా కారు లాజరస్ అన్నారు. మండల అభివృద్ధి కార్యాలయం వరకు వెళ్లారు. అనంతరం మండల అభివృద్ధి కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్ మండల అధ్యక్ష కార్యదర్శులు కారు యర్జా కారు లాజరస్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టంలో కొత్తగా ఫేష్ యాప్ కూలీలకు ఏర్పాటు చేయటంల వల్ల గ్రామాలలో ఇంటర్నెట్ సౌకర్యం లేక ఫేష్ యాప్ నమోదు కాక కూలీలు పనులు కోల్పోతున్నారు అన్నారు. వి బి జి గ్రామ్ జి స్కీమ్ లో రాష్ట్ర ప్రభుత్వం 40% అంటే 4000 కోట్ల రూపాయలు కేటాయిస్తే కేంద్రం 6000 కోట్లు ఇస్తామని చెప్పింది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపాధి హామీకి నిధులు ఇవ్వడానికి 4000 కోట్లు మా దగ్గర లేవని చెప్పడంతో కేంద్రం కూడా నిధులు ఇవ్వలేదు ఫలితంగా చట్టం చుట్టబండలయ్యే పరిస్థితికి దాపురించింది అన్నారు.మ్యానువల్ మాస్టర్ వేసే స్థానంలో ఫేషియ బ్ తీసుకొచ్చారు దీనివల్ల కొన్నిచోట్ల నెట్ సౌకర్యం లేక గంటల తరబడి హాజరు పడక పేదలు పని ప్రదేశాల నుండి ఉసురుమంటూ ఇంటికి తిరిగి వస్తున్నారు తక్షణమే దీనిని రద్దుచేసి అడిగిన ప్రతి పేదవారికి పని కల్పించాలని డిమాండ్ చేశారు.సమ్మర్ అలవెన్స్ తిరిగి కొనసాగించాలని మంచినీళ్లు మజ్జిగ సౌకర్యం కల్పించాలని 30 రోజులు పనిచేసిన ప్రతి కుటుంబానికి పనిముట్లు ఇవ్వాలని కోరారు వడదెబ్బకు చనిపోయిన ఉపాధి కూలీలకు 25 లక్షల రూపాయలు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని కోరారు.వి బి జి గ్రామ్ జీ స్కీమ్ రద్దుచేసి పాత చట్టాన్ని పునర్దించి 200 రోజులు పనులు కల్పించాలి రోజుకు 700 రూపాయలు వేతనం ఇవ్వాలని అవినీతి అరికట్టాలని పని కావాలా దరఖాస్తు పెట్టుకున్న వారందరికీ పని కల్పించాలని నిరుద్యోగ భృతి అమలు చేయాలని తెలిపారు.కలస్పాడు మండల పరిధిలో రాజుపాలెం పుల్లారెడ్డి పల్లె కొండపేట చిన్న పల్లె కొండపేట కలసపాడు తదితర గ్రామాలలో గత సంవత్సరం మే జూన్ నెలలో పనిచేసిన డబ్బులు ఇప్పటికే ఇవ్వలేదని స్థానిక ఎంపీడీవో మాణిక్యమ్మ కు కూలీలు
ఫిర్యాదు చేశారు.రాజుపాలెం గ్రామం ఫీల్డ్ అసిస్టెంట్ ఎస్సీ కూలీల పట్ల వివక్ష చూపుతున్నాడు.పనులు చేసిన కొలతలు సక్రమంగా తీయకుండా తగ్గించి కూలి వేస్తున్నారు అని ఫిర్యాదు చేశారు. ధర్నా అనంతరం ఎంపీడీవో మాణిక్యమ్మకు వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు హుస్సేన్ పీరా సుబ్బరాయుడు సత్యబాబు బాబు రత్నబాబు గడ్డం కుమారి రుతమ్మ తదితరులు పాల్గొన్నారు.