ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశంలో కనీస వసతులు కల్పించాలి సిపిఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్
బెజ్జంకి,ఏప్రిల్ 17(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఉపాధి హామీ పనులకు వెళ్తున్న కూలీలకు తగిన వసతులు కల్పించాలని సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మండలంలోని అన్ని గ్రామాల కూలీలు ప్రస్తుతం పనుల్లో పాల్గొంటున్నప్పటికీ, తీవ్రమైన ఎండల కారణంగా వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.పని ప్రదేశాల్లో చల్లటి తాగునీరు, నీడ కోసం టెంట్లు, ఒఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రాథమిక వైద్య కిట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అలాగే గ్రామాల నుండి పని ప్రదేశాలు దూరంగా ఉన్న...