ఉపాధి హామీలో ఫీల్డ్ అసిస్టెంట్ల దోపిడీ..!
వైఎస్ఆర్ కడప జిల్లా,(మే19 ప్రజావాణి) పోరుమామిళ్ల మండల పరిధిలోని కొన్ని గ్రామాలలో గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు చేతినిండా పని కల్పించి, వలసలను నివారించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొందరికి కాసుల వర్షం కురిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన కొందరు అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు చేతులు కలపడంతో ఉపాధి నిధులు అర్హుల పొట్ట నింపాల్సింది పోయి, అక్రమార్కుల జేబుల్లోకి చేరుతున్నాయి. పనులకు వెళ్లకుండానే ఇంట్లో కూర్చున్న వారికి సైతం భారీగా బిల్లులు చెల్లిస్తూ, అందులో సగం వాటాలు...