prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 11:16 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఉపాధి హామీలో ఫీల్డ్ అసిస్టెంట్ల దోపిడీ..!

వైఎస్ఆర్ కడప జిల్లా,(మే19 ప్రజావాణి)  పోరుమామిళ్ల మండల పరిధిలోని కొన్ని గ్రామాలలో గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు చేతినిండా పని కల్పించి, వలసలను నివారించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొందరికి కాసుల వర్షం కురిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన కొందరు అధికారులు, ఫీల్డ్ అసిస్టెంట్లు చేతులు కలపడంతో ఉపాధి నిధులు అర్హుల పొట్ట నింపాల్సింది పోయి, అక్రమార్కుల జేబుల్లోకి చేరుతున్నాయి. పనులకు వెళ్లకుండానే ఇంట్లో కూర్చున్న వారికి సైతం భారీగా బిల్లులు చెల్లిస్తూ, అందులో సగం వాటాలు దండుకుంటూ సరికొత్త ‘ఫీల్డ్ మాయాజాలానికి’  తెరలేపారు.రెక్కాడకుండానే..డొక్క నిండుతోంది.? పోరుమామిళ్ల మండలంలోని చాలా గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.నిబంధనల ప్రకారం.కూలీలు రోజువారీగా పని ప్రదేశానికి వెళ్లి నిర్ణీత సమయంలో పనులు చేయాల్సి ఉంటుంది. కానీ, మండలంలోని పలు గ్రామాల్లో సీన్ రివర్స్ అయింది. గ్రామంలోని కొందరు బడా బాబులు, ఫీల్డ్ అసిస్టెంట్లతో ముందస్తుగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. వీరు ఒక్క రోజు కూడా పనికి వెళ్లరు, కనీసం గునపం, పార కూడా పట్టుకోరు.కానీ, ప్రతి వారం వీరి ఖాతాల్లోకి డబ్బులు జమవుతున్నాయి. కాయకష్టం చేసే పేదవాడికి కూలి దక్కడం గగనమవుతుంటే.ఇక్కడ మాత్రం ఎలాంటి శ్రమా లేకుండా,రెక్కాడకుండానే అక్రమార్కుల డొక్క నిండుతుండటం గమనార్హం.గ్రామాలలో ఈ అక్రమాలు భారీగా సాగుతున్నట్లుతెలుస్తోంది. పోరుమామిళ్ల మండల పరిధిలోని కొన్ని  ఈ గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల పాత్ర కీలకంగా మారినట్లు సమాచారం. పనికి రాని వారి పేర్లను మస్టర్లలో నమోదు చేసి, ఆన్లైన్ హాజరు వేస్తున్నారు. ఖాతాల్లో బిల్లు పడగానే, సదరు లబ్ధిదారుడి నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు 50 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారని, అక్కడ ఈ ‘సగం-సగం’ ఒప్పందం జోరుగా సాగుతోందని ఉపాధి కూలీలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అంటే కష్టపడకుండా కూలీకి సగం, ఏమీ చేయకుండా ఫీల్డ్ అసిస్టెంట్కు సగం అన్నమాట! ఇంట్లో కూర్చున్న వారికి అక్రమంగా బిల్లులు చెల్లిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు .ఎండనక, వాననక కష్టపడే నిజమైన కూలీల పొట్ట కొడుతున్నారు. క్షేత్రస్థాయిలో నిజాయితీగా పనిచేసే కూలీలకు రకరకాల సాకులు చెపుతూ బిల్లులు సకాలంలో చెల్లించకుండా తిప్పించుకుంటున్నారు. పని చేయని వారికి మాత్రం నిమిషాల్లో బిల్లులు పడిపోతుండటం వెనుక ఉన్న మతలబు ఏమిటని తోటి కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయోమెట్రిక్, జియో ట్యాగింగ్ వంటి సాంకేతికతను కూడా ఈ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటూ ప్రభుత్వ నిధులను యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ఉన్నతాధికారులు పర్యవేక్షణ ఏది.?పోరుమామిళ్ల మండల పరిధిలోని కొన్ని  గ్రామాల్లో ఈ భారీ అక్రమాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నా ఉన్నతాధికారులు మాత్రం పనులకు వెళ్లకున్నా పడుతున్న బిల్లులు అర్హుల పొట్టగొడుతున్న అక్రమార్కులు అధికారుల పర్యవేక్షణ కరువు కంటితుడుపు చర్యలతో సరిపెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఏటా నిర్వహించే ‘సోషల్ ఆడిట్’ (సామాజిక తనిఖీ) కేవలం రికార్డుల సరిచూడటానికే పరిమితమవుతోందని, క్షేత్రస్థాయి పరిశీలన శూన్యమని స్థానికులు మండిపడుతున్నారు. ఎపిఓ,ఈసీ వంటి అధికారులు క్షేత్రస్థాయి పనులను క్రమం తప్పకుండా పరిశీలించాల్సి ఉన్నా,కార్యాలయాలకే పరిమితం కావడం ఈ అక్రమార్కులకు మరింత వరంగా మారింది. నిజాయితీగా పనిచేసే కూలీలకు సకాలంలో,పూర్తిగా బిల్లులు ఇవ్వకుండా. అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న  పోరుమామిళ్ల  మండల ఫీల్డ్ అసిస్టెంట్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి,పోరుమామిళ్ల మండలంలోని అన్ని గ్రామాల్లో, ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న, నకిలీ మస్టర్లపై నిఘా పెట్టి బాధ్యులైన ఫీల్డ్ అసిస్టెంట్లు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. రేపటి సంచికలో  ఫీల్డ్ అసిస్టెంట్లు పేర్లతో సహా ప్రజావాణిలో దినపత్రికలో