ఉపాధి హామీలో కొత్త దోపిడీ: వాట్సప్ వీడియో కాల్ ఆన్ చెయ్ ఆజరుపట్టు 

టేకుర్‌పేటలో వీడియో కాల్ హాజరుపై తీవ్ర దుమారం. పోరుమామిళ్ల జులై 09ప్రజావాణి టేకుర్‌పేట పంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల దోపిడీకి సంబంధించి అటు ప్రజల నుంచి,ఇటు సోషల్ మీడియాలో ఆరోపణలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి.పేద కూలీల కడుపు కొట్టేందుకు క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది అడ్డదారులు తొక్కుతున్నారని,టెక్నాలజీని సైతం తమ అవినీతికి అనుకూలంగా మార్చుకుంటున్నారని స్థానికులు మండిపడుతున్నారు.పారదర్శకత ఉండాల్సిన ప్రభుత్వ పథకంలో జరుగుతున్న ఈ బరితెగింపు వ్యవహారంపై స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పండుగ వేళ.దొంగ మస్టర్లు గ్రామాల్లోని పేదలకు...