ఉపాధి శ్రామికులకు ఓ ఆర్ ఎస్ పంపిణీ……
ప్రజావాణి మే 01:మోతే మండలం, మామిళ్ళగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శి దేవేందర్ గారు మరియు ఆశవర్కర్ సుభద్ర గారి ఆధ్వర్యాలలో ఉపాధి కూలీలకు ఓ ఆర్ ఎస్ పంపిణీ చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరూ ఒక లీటర్ నీటిలో ఒక పాకెట్ ఓ ఆర్ ఎస్ పౌడర్ కలుపుకొని తాగితే శరీరంలో డిహైడ్రెషన్ తగ్గుతుందని సూచించారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ లింగయ్య గారు, మేట్ మధు,ఉపాధి కూలీలు వెంకట్ రెడ్డి,వెంకన్న, కె .సైదులు, వీరభద్రం పాల్గొనడం జరిగింది.