ఉపసర్పంచుల ఫోరం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

ఎండపల్లి మండలంలో బుధవారం ఉపసర్పంచుల ఫోరం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మేరుగు జాని, జిల్లా అధ్యక్షులు ముత్యాల స్వామి, కన్వీనర్ గురిజాల బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా సింహరాజు క్రాంతి (కొత్తపేట), ఉపాధ్యక్షులుగా చీమల శ్రీనివాస్ (మారేడుపల్లి), వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అలుగం తిరుపతి (చెర్లపల్లి), ప్రధాన కార్యదర్శిగా తనుగుల విజయ్ (కొండాపూర్) ఎన్నికైనట్లు రాష్ట్ర కార్యదర్శి మేరుగు జాని తెలిపారు.