ఉద్యోగ ఒత్తిడి, అనారోగ్యంతో ప్రైవేట్ ఉద్యోగి ఆత్మహత్య

పోచారం, జూన్ 29: పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి హోటల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎస్‌ఆర్ కండ్రిక గ్రామానికి చెందిన పరుచూరి మహేష్ (40) గత కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో నివాసముంటూ హైటెక్ సిటీలోని ఎన్‌టిటి డేటా సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కుటుంబంతో కలిసి పోచారంలోని ఏఎస్‌బీఎల్ స్ప్రింగ్స్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. ఇటీవల కొంతకాలంగా అనారోగ్యంతో పాటు ఉద్యోగ సంబంధిత ఒత్తిడితో...