ఉద్యోగ, ఉపాధ్యాయులను విస్మరిస్తే మూల్యం చెల్లించక తప్పదు. -పిఆర్సీ అమలులో జాప్యాన్ని ఒప్పుకోం. యుటిఎఫ్
కడప జిల్లా ప్రజావాణిన్యూస్ (ఏప్రిల్1)ఉద్యోగ,ఉపాధ్యాయులను విస్మరిస్తే కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.జాబీర్ హెచ్చరించారు.యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రణభేరి 3.0 కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం కడప కలెక్టరేట్ వద్ద యుటిఎఫ్ కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను చేపట్టారు.ఈ సందర్భంగా ఎస్.జాబీర్ మాట్లాడుతూ ఉద్యోగ,ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.ప్రతిపక్ష హోదాలో కూటమి పెద్దలు ఉద్యోగ,ఉపాధ్యాయులకు అనేక హామీలిచ్చారని పేర్కొన్నారు.తాము అధికారంలోకి వస్తే 12వ పిఆర్సీని అమలు...