ఉద్యోగ ఇంటర్వ్యూకు వెళ్తున్నానని చెప్పి అదృశ్యమైన మహిళ.. కేసు నమోదు

ఘట్కేసర్ జూన్ 6: ఘట్కేసర్ మండలంలోని అన్నోజిగూడ ఆర్‌జీకే కాలనీకి చెందిన ఓ మహిళ అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం, ఆర్‌జీకే కాలనీ నివాసి నడింపల్లి సురేష్ వర్మ (44) తన భార్య నాగేశ్వరి (36) కనిపించడం లేదంటూ జూన్ 5న పోచారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు, సురేష్ వర్మకు 2008లో నాగేశ్వరితో వివాహం కాగా వారికి ఒక కుమారుడు ఉన్నాడు. నాగేశ్వరి గత రెండేళ్లుగా అన్నోజిగూడలోని ట్యులిప్స్ హోటల్‌లో హౌస్‌కీపింగ్ ఉద్యోగం చేస్తూ,...