ఉద్యోగాలు, విద్య, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం యువత ఉద్యమించాలి….. అన్నోజీగూడలో ఏఐవైఎఫ్ ఘట్‌కేసర్ మండల 3వ మహాసభ

ఘట్‌కేసర్, ఆగస్టు 3: దేశ యువత ఆశయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, నిరుద్యోగం, ఉద్యోగాల భర్తీలో జాప్యం, ప్రభుత్వ రంగ సంస్థల బలహీనీకరణ, విద్యా రంగంలోని సమస్యలు యువత భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర అన్నారు. సోమవారం అన్నోజీగూడలో నిర్వహించిన ఏఐవైఎఫ్ ఘట్‌కేసర్ మండల 3వ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి మండల కార్యదర్శి సంపంగి సదాశివ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ...