ఉద్యోగానికి వెళ్లి అదృశ్యమైన యువతి.. కేసు నమోదు

పోచారం, జూన్ 11: విధులకు వెళ్లిన ఓ యువతి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కీసర మండల పరిధిలోని రాంపల్లి 2బీహెచ్‌కే హౌసింగ్ కాలనీలో నివాసముంటున్న చిట్యాల లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చిట్యాల లక్ష్మి కుమార్తె రేవతి (20) ప్రైవేట్ ఉద్యోగిని. గతంలో కొత్తపేటలోని ఓ సంస్థలో పనిచేసిన ఆమె ఇటీవల సికింద్రాబాద్‌లోని మరో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు...