ఉద్యోగం ప్రభుత్వనిదా చదువు ప్రైవేట్ పాఠశాలల్లోనా
ఉద్యోగం ప్రభుత్వనిదా... చదువు ప్రైవేట్ పాఠశాలల్లోనా?గోదావరిఖని ప్రతినిధి, మన సమగ్ర ప్రజావాణి, జూన్ 24నేటి సమాజంలో ఒక విచిత్రమైన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షలాది మంది యువత పోటీ పడుతున్నారు. స్థిరత్వం, భద్రత, గౌరవం, మంచి వేతనం వంటి కారణాలతో ప్రభుత్వ ఉద్యోగాలను అత్యంత ప్రాధాన్యంగా భావిస్తున్నారు. అయితే అదే సమయంలో తమ పిల్లల విద్య విషయంలో మాత్రం ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం తగ్గించి ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గుచూపుతున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో,...