prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 February 2026, 10:05 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఉద్యాన శాఖ – రైతు అవగాహన కార్యక్రమం.

కాశీనాయన మండలం, కొండరాజుపల్లె రైతు సేవకేంద్రం పరిధిలో ఉద్యాన శాఖ ఆద్వర్యం లో “ ఆయిల్ పామ్ సాగులో సమగ్ర ఎరువుల యాజమాన్యం మరియు మామిడి లో ఫ్రూట్ కవర్స్ వాడకం “ అనే అంశం పైన రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినధి.
ఇందులో బాగంగా పోరుమామిళ్ల ఉద్యనాధికారి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ మామిడి, దానిమ్మ, జామ లాంటి పండ్ల తోటలలో పండ్ల కవర్స్ వాడుకోవడం ద్వారా పండ్లను పండు ఈగ ద్వారా జరిగే నస్తాన్ని తగ్గించుకోవచ్చును . పండ్లను ఎండ వేడిమి, ఈదురు గాలులు , సూర్యరశ్మి వంటి వాటి నుండి రక్షించు కోవచ్చును. చీడ, పీడల నుండి రక్షించుకోవడం తద్వారా పురుగుమందుల ఖర్చును తగ్గించుకోవచ్చును. అలాగే పండ్ల రంగు, నాణ్యతా , పెరుగుట ద్వారా ఎగుమతికి దోహదపడతాయి మరియు మార్కెట్ లో మంచి దరను పొందవచ్చునని తెలిపారు.
మామిడికి ఈ ఫ్రూట్ కవర్స్ ఏకరికి దాదాపు 6000 కవర్స్ అవసరం అవుతీయని, కవరు ఒక్కొనటికి రూ.2.00 అయితే ఒక్క కవరికి రూ.1.00 ప్రభుత్వ రాయితీ పొందవచ్చునని తెలిపారు. కావున మామిడి పండించే రైతులు ఈ అవకాశం ను వాడుకోవాలని కోరారు. అలాగే అరటికి ఈ కవర్స్ కట్టుకొనే రైతులకు గెలలకు రూ. 5 .00 రాయితీ కాలదని తెలిపారు. అలాగే డ్రిప్ పరికాల అమరికతో పాటు ఈ సంవత్సరం నుండి మొబిల్ స్మార్ట్ ఫోన్ నే రిమోట్ గా వాడుకొని కంట్రోల్ చేసి, పాంతలకి నీటిని అందించే ఆటోమేషన్ సిస్టమ్ కి రాయితీ ఇవ్వడం జరుగుతుందని , రైతులు ఈ అవకాశం ను కు వాడుకోవాలని కోరారు. ఆటోమేషన్ సిస్టమ్ కి ఒక హెక్టరేకి రూ. 22,000 మరియు పెద్ద రైతులకి 18000 రాయితీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
తదుపరి ఆయిల్ పామ్ కంపెనీ సువేన ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రతినిధి కొండ రెడ్డి మాట్లాడుతూ ఆయిల్ పామ్ లాంటి నూనె పంటలలో అదిక నూనె దిగుబడికి మెగ్నీసియం లాంటి సూక్ష్మ పోషకాల వాడకం చేయాలని, అలాగే బొరోన్ పోషక లోపం ఎక్కువగా గమనించినట్లు తెలిపారు. నైట్రోజన్, పొటాష్ తో పాటుగా జింక్ , బొరోన్ లాంటి సూక్ష్మ పోషకాలను అందివ్వాలని , వేరు వ్యవస్త దెబ్బడినకుండా దుక్కులు, అంతర కృషి చేపట్టాలని రైతులకు చూసించారు పంట తొలి దశలో వచ్చే పూ మొగ్గలను మూడు సంవత్సరాల వరకు తొలగించుట ద్వారా మొక్క పెరుగుదలకు సహాయపడాలని తెలిపారు.
ఈ కార్యక్రమం లో మైక్రో ఇరిగేషన్ ఏరియా ఆఫీసర్ మహేష్ కుమార్, గ్రామ ఉద్యాన సహాయకులు ఉమా మహేశ్వరి , నీలవేణి , కోరమండల్ కంపెనీ ప్రతినిధి నర్సి రెడ్డి, మహేశ్వర రెడ్డి మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు