ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం ఐక్యంగా పోరాడుదాం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి – వోరగంటి ఆనంద్

బెజ్జంకి, ఆగస్టు 8 (ప్రజావాణి) తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (TUF) నాయకులు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని సత్యార్జున ఫంక్షన్ హాల్‌లో బెజ్జంకి, గన్నేరువరం మండలాల ఉద్యమకారుల సమావేశాన్ని TUF రాష్ట్ర కార్యదర్శి శానగొండ శరత్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వోరగంటి ఆనంద్ హాజరయ్యారు. ఉద్యమకారులకు న్యాయం చేయాలి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు తమ కుటుంబాలను, ఉద్యోగాలను, వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి...