ఉదృతం పల్స్ పోలియో ఇమ్యూనైజేషన్ -2026 నిండు జీవితానికి రెండు చుక్కలు…… మోతే మండలం లోని పలు గ్రామాలలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతం…….

ప్రజావాణి మోతే జూన్ 28: మామిళ్లగూడెం గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో నివారణ కోసం రెండు చుక్కల పోలియో వ్యాక్సిన్‌ను అందించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక బూత్‌లను ఏర్పాటు చేసి చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. అలాగే బూత్‌కు రాలేని చిన్నారుల కోసం ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు అందించారు. వైద్య సిబ్బంది మాట్లాడుతూ, ప్రతి చిన్నారికి తప్పనిసరిగా...