38 మందికి ఉచిత శస్త్రచికిత్సలు
-లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
గోదావరిఖని జూలై 31 ప్రజావాణి :
గోదావరిఖని, కళ్యాణ్ నగర్‌లోని 52వ డివిజన్ రాజస్థాన్ భవనంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని ఆధ్వర్యంలో, కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత కంటి ఆపరేషన్ మరియు తపసణీ శిబిరానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది.
ఈ వైద్య శిబిరంలో సుమారు 72 మందికి క్షుణ్ణంగా కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 38 మందికి కంటి శస్త్రచికిత్సలు అవసరమని వైద్యులు నిర్ధారించారు. శస్త్రచికిత్సకు ఎంపికైన వారిని ప్రత్యేక బస్సు ద్వారా కరీంనగర్‌లోని రేకుర్తి కంటి ఆసుపత్రికి ఉచిత ఆపరేషన్ల నిమిత్తం తరలించినట్లు నిర్వాహకులు తెలిపారు.
అధిక రక్తపోటు (BP), మధుమేహం (Sugar) మరియు ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఈ విడతలో వెళ్ళలేకపోయిన వారికి, తదుపరి నిర్వహించే శిబిరంలో మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఆసుపత్రికి తీసుకువెళ్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో 52వ డివిజన్ కార్పొరేటర్ చిధ్రల నాగరాజు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు చిట్టిమల కిషోర్, సెక్రెటరీ అల్లాడి నాగరాజు, ట్రెజరర్ చింతకింది కృష్ణ, లీయో టు లైన్ కోఆర్డినేటర్ నార్ల ప్రసాద్, జోన్ చైర్మన్ కొమరవెల్లి సుధాకర్, లక్ష్మీవాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
వీరితో పాటు లయన్స్ క్లబ్ ఆఫ్ లక్ష్మీ నగర్ అధ్యక్షులు అనఘం కృష్ణమూర్తి, DC విజన్ కోఆర్డినేటర్ చందర్ గుప్తా, DC ఐ క్యాంప్స్ స్క్రీనింగ్ కోఆర్డినేటర్ మామిడిపల్లి శ్రీధర్, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి అధ్యక్షులు కోదాటి ప్రవీణ్, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని వాసవి అధ్యక్షులు కొమరవెల్లి రాహుల్‌తో పాటు లయన్స్ క్లబ్ ప్రతినిధులు, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశా