కడప,ప్రజావాణిన్యూస్(మార్చి26) ఈ నెల 28న జరిగే జెడ్పి సర్వసభ్య సమావేశానికి.అన్ని శాఖల జిల్లా అధికారులు.ప్రగతి నివేధికలతో పాటు అభివృద్ధి ప్రతిపాదనల సమగ్ర సమాచారంతో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.కడప జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ నెల 28 (శనివారం) ఉదయం 9.30 లకు సర్వసభ్య సమావేశం జరుగుతుందని,జెడ్పి చైర్మన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు.కావున జిల్లా పరిషత్ సర్వసభ్య కమిటీ సభ్యులందరూ.జిల్లాలో అభివృద్ధి ప్రగతి నివేధికలతో పాటు.అభివృద్ధి చేయాల్సిన అంశాల ప్రతిపాదనలకు సంబంధించి సమగ్ర సమాచారంతో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.