ఈ నెల 27 న బక్రీద్ పండుగ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి..కడప జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్

కడప (మే15) ప్రజావాణి న్యూస్ ఈ నెల 27 న బక్రీద్ పండుగ నేపథ్యంలో వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పండుగ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేయాలని,ముఖ్య రహదారులు మరియు జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు...