కడప (మే15) ప్రజావాణి న్యూస్ ఈ నెల 27 న బక్రీద్ పండుగ నేపథ్యంలో వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పండుగ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేయాలని,ముఖ్య రహదారులు మరియు జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహించాలని సూచించారు.సోషల్ మీడియాలో మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.మసీదులు,ప్రార్థనా స్థలాలు,రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజలకు భద్రత కల్పించనున్నట్లు వెల్లడించారు ప్రజలు సోషల్ మీడియాలో అసత్య,చట్టవ్యతిరేక సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో,పరస్పర గౌరవం మరియు మత సామరస్యంతో జరుపుకోవాలని వై.ఎస్.ఆర్ కడప జిల్లా ఎస్.పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పీ.ఎస్ పిలుపునిచ్చారు.సమావేశంలో అడిషనల్ ఎస్.పీ (ఏ.ఆర్) శ్రీ బి.రమణయ్య,రాజంపేట ఏ.ఎస్.పీ శ్రీ మనోజ్ రామనాథ్ హెగ్డే,స్పెషల్ బ్రాంచ్ డీ.ఎస్.పీ శ్రీ ఎన్.సుధాకర్,కడప ఇంచార్జ్ డి.ఎస్.పి శ్రీ ఇ.బాలస్వామి రెడ్డి, పులివెందుల డి. ఎస్.పీ బి.మురళి,జమ్మలమడుగు డి.ఎస్పీ వెంకటేశ్వర రావు మైదుకూరు డి.ఎస్.పీ జి.రాజేంద్ర ప్రసాద్,పోలీస్ అధికారులు,పాల్గొన్నారు.