ఈనెల 19 20 తేదీలలో జరగబోయే జిల్లా మహాసభలను జయప్రదం చేయండి,,దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు నాగదాసరి ఇమ్మానుయేలు
కడప జిల్లా ప్రజావాణిన్యూస్(ఏప్రిల్11) ఈనెల 19 20 తేదీలలో బద్వేలు లో జరగబోయే కడప జిల్లా నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని,దళిత హక్కుల పోరాట సమితి కడప జిల్లా అధ్యక్షులు ప్రజలకు పిలుపునిచ్చారు.శనివారం పోరుమామిళ్లలో ముఖ్య నాయకుల సమావేశంలో కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా ఇమ్మానుయేలు మాట్లాడుతూ భారత రాజ్యాంగం మనుషులకు స్వాతంత్రం సమానత్వం సౌబ్రాతృత్వం నిర్దేశించింది.కానీ భారత రాజ్యాంగం పై ప్రమాణం చేసిన పాలకులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ మనుషుల హక్కులను కాల రాసే ప్రయత్నం సాగిస్తున్నారన్నారు.భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి...