prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 9:25 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఈనెల 14 న భూ పంపిణీ అమలు చేయాలని జిల్లా సదస్సును జయప్రదం చేయండి. కడప యు.టిఎఫ్

ప్రజావాణి న్యూస్ :(మార్చి 10)కడప జిల్లాలో భూమిలేని నిరుపేదలకు భూ పంపిణీ అమలు చేయాలని ఈనెల 14వ తేదీ కడప యుటిఎఫ్ భవనంలో జిల్లా భూ సదస్సును జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి శివకుమార్ వి అన్వేష్ తెలిపారు మంగళవారం ఉదయం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి శివకుమార్ అన్వేష్ మాట్లాడుతూ రాష్ట్రం విభజన ఏర్పడినప్పటి నుంచి జిల్లాలో గ్రామీణపేదలకు భూ పంపిణీకి నోచుకోలేదు అన్నారు రాష్ట్రంలో పరిపాలించిన టిడిపి వైసిపి కూటమి ప్రభుత్వాలు పేదలకు భూ పంపిణీ అమలు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు జిల్లాలో కాశి నాయన కలసపాడు పోరుమామిళ్ల అట్లూరు బి కోడూరు బ్రహ్మంగారిమఠం ఒంటిమిట్ట సిద్ధవటం నందలూరు పెండ్లిమర్రి తదితర మండలలోప్రభుత్వ భూములను రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు బంధువులు ధనవంతులు ఇతర జిల్లాలకు చెందిన వారు అనహ్రూలు 14 సంవత్సరాలలో లక్ష ఎకరాల ప్రభుత్వ భూములు భూ అక్రమాలకు పాల్పడినారు అసైన్డ్ చట్టాన్ని ఉల్లంఘించి రెవెన్యూ అధికారులతో లాలూచీపడి దొంగ పాస్ బుక్కులు పట్టాలు ఆన్లైన్లో నమోదు చేయించుకున్నారు బ్యాంకులలో లోన్లు పెట్టి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నారు కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులో పెద్ద ఎత్తున భూముల అన్యకాంతమైనయని అర్జీలు వచ్చినాయి వాటిని పరిగణనలోకి తీసుకొని పోలీస్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అనహ్రూలు వద్ద ఉన్న ప్రభుత్వ భూములన్నీ స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారుఅదేవిధంగా 12 సంవత్సరాల నుంచి సాగులో ఉన్న పేదలకు కూడా పట్టాలు మంజూరు చేయాలన్నారుగత 50 సంవత్సరాల నుంచి జడ్ హెచ్ డి సి సొసైటీ భూములు సాగు చేస్తున్న గోపవరం అట్లూరు మైదుకూరు ఖాజీపేట మండలాలకు చెందిన దళితులకు పట్టాలు ఆన్లైన్లో రైతు భరోసా క్రాఫ్ ఇన్సూరెన్స్ రుణమాఫీ తదితర సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం వహించటం సమంజసం కాదన్నారు వెంటనే వారందరికీ పట్టాలు ఆన్లైన్లో రైతు భరోసా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం యధావిధిగా అమలు చేయాలని కోరారు వి బి జి రామ్ జి స్కీంవల్ల గ్రామీణ పేదలు తీవ్రంగా నష్టపోతారు రాష్ట్ర ప్రభుత్వం పైన40 శాతం నిధులు జమ చేయాల్సి ఉంటుంది కాబట్ట రాష్ట్రంపై తీవ్ర ప్రభావం పడుతుంది వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు ఇప్పటివరకు జిల్లాలో ఉపాధి పనులు కూలీలకు పనులు కల్పించలేదు గత సంవత్సరం ఉపాధి అధికారులు 50 రోజులకు మించి కూలీలకు పనులు కల్పించలేదు అన్నారు వెంటనే పనులు కల్పించాలని డిమాండ్ చేశారు లేనియెడల ఈనెల 14వ తేదీ కడప లో జరుగు జిల్లా భూ సదస్సులో ఆందోళన పోరాటాలను రూపొందిస్తామని తెలిపారు