ఈదురు గాలులతో భారీ వర్షం.. కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఆందోళన ధాన్యం తడిసి రైతులకు తీవ్ర నష్టం కొనుగోళ్లు వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్న రైతులు
బెజ్జంకి, మే 7 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పలు గ్రామాల్లో గురువారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ అకాల వర్షం కురవడంతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడాల్సి వచ్చింది.వర్షానికి తోడు బలమైన ఈదురు గాలులు వీయడంతో ధాన్యం ఉప్పలపై కప్పిన టార్పాలిన్ కవర్లు ఎగిరిపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం...