prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 10:56 am Digital Edition : RAJASHEKARREDDY

” ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం బీభత్సం.. నిరాశ్రయులైన కుటుంబాలు” ఈదురుగాలులతో నష్టపోయిన కుటుంబాన్ని పరామర్శించిన –బెజ్జంకి మండల బీఆర్ఎస్ నాయకులు

 

బెజ్జంకి, మే 26 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గూడెం గ్రామంలో ఇటీవల వీచిన ఈదురుగాలుల కారణంగా గాజు విజయరెడ్డి ఇంటిపై ఉన్న రేకులు పూర్తిగా కొట్టుకుపోయి తీవ్ర నష్టం వాటిల్లింది.
ఈ విషయం తెలుసుకున్న బెజ్జంకి మండల బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి,బీఆర్ఎస్ నాయకులు మంగళవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పిన అనంతరం వారు మాట్లాడుతూ ప్రకృతి విపత్తులతో నష్టపోయిన ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లింగాల లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.