ఈడబ్ల్యూఎస్ కాలనీలో 8 సీసీ కెమెరాల ఏర్పాటు….. కమ్యూనిటీ సీసీ కెమెరా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఘట్‌కేసర్ సి ఐ బాలస్వామి, ఎస్సై ప్రభాకర్
ఘట్‌కేసర్, జూలై: ప్రజల భాగస్వామ్యంతో నేరాల నియంత్రణకు మరింత బలోపేతం కల్పించే లక్ష్యంతో ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటీ సీసీ కెమెరా కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఈడబ్ల్యూఎస్ కాలనీలో స్థానిక దాతల సహకారంతో 8 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సోమసాని రమేష్, సోమసాని వెంకటేష్, తలతోటి వరమ్మ దాతలుగా సహకారం అందించారు. ఈ సందర్భంగా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బాలస్వామి మాట్లాడుతూ ఆధునిక పోలీసింగ్‌లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని...