ఇస్లామిక్ పుస్తక స్టాల్ ఏర్పాటు — ఎమ్మెల్యే శ్రీ అశోక్ రెడ్డి హాజరు
ప్రజావాణిన్యూస్(మార్చి21)గిద్దలూరు,స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్,గిద్దలూరు యూనిట్ ఈద్ సందర్భంగా పట్టణంలోని ఈద్‌గాహ్‌లో నిర్వహించిన ఈద్ నమాజ్‌లో ఉత్సాహంగా మరియు సామాజిక స్ఫూర్తితో పాల్గొంది.ఈ సందర్భంగా ప్రజల్లో ఇస్లామిక్ బోధనలపై అవగాహన పెంపొందించేందుకు ఇస్లామిక్ పుస్తక స్టాల్‌ను కూడా ఏర్పాటు చేసింది.ఈ పుస్తక స్టాల్‌లో పవిత్ర ఖుర్‌ఆన్,హదీస్ సంకలనాలు,నైతిక విలువలు,వ్యక్తిత్వ వికాసం మరియు ఆధునిక సమస్యలపై ఇస్లామిక్ దృక్పథంతో కూడిన పుస్తకాలు అందుబాటులో ఉంచారు.ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.సందర్శకులు అందుబాటులో ఉన్న పుస్తకాలపై ఆసక్తి చూపించారు.గౌరవనీయ ఎమ్మెల్యే శ్రీ అశోక్ రెడ్డి గారు...